AP: సీఎం చంద్రబాబు వ్యక్తిగత విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 20న తన జన్మదినాన్ని ఇటలీలో కుటుంబసభ్యులతో జరుపుకోబోతున్నారు. దీని కోసం కొద్దిసేపటి కిందటే బయలుదేరి వెళ్లారు. తొలుత దిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు ఇటలీ వెళ్తారు. దిల్లీలో ఎవరినీ కలవడం లేదని.. నేరుగా ఇటలీ ఫ్లైట్ ఎక్కుతారని తెలుస్తోంది. ఆయన వెంట కుటుంబసభ్యులందరూ ఉన్నారు.