AP: తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు ప్రజలందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు పడి, పాడి పంటలతో రాష్ట్రం శోభిల్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లేరోజు అని, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.