ఆరు సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కలలు ఫలించాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు కృతజ్ఞతగా, అభ్యర్థులతో కలిసి శాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతిలో పాలాభిషేకం నిర్వహించారు. జై బాబు, జై లోకేష్ అంటూ జేజేలు కొట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మోగా డీఎస్సీని రిలీజ్ చేసినందుకు రవి నాయుడు థ్యాంక్యూ చెప్పారు.