GOOD NEWS చెప్పిన చంద్రబాబు సర్కార్

57చూసినవారు
GOOD NEWS చెప్పిన చంద్రబాబు సర్కార్
AP: చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచింది. పశువైద్య, అగ్రికల్చర్ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను రూ.7 వేల నుంచి రూ.10 వేలకు, పీజీ విద్యార్థులకు రూ.12 వేలకు పెంచింది. అలాగే సన్నరకం వరి సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, బీసీ కార్పొరేషన్ ద్వారా యాదవ, కురబలకు గొర్రెలు, మేకలు పంపిణీ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్