AP: లిక్కర్ స్కామ్‌లో అసలు దోషి చంద్రబాబేనని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలం సృష్టించి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు.