తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కీలక హామీగా పేర్కొన్న "తల్లికి వందనం" పథకం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నెరవేర్చడం ద్వారా ప్రభుత్వం విశ్వసనీయతను చాటుకుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా వారందరికీ ఈ సహాయం అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడం వలన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..