AP: పాలనాపరంగా మార్పులపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వపరంగా అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తొమ్మిది నెలల కాలంలో సాధించిన పురోగతిపై సమీక్షించనున్నారు. ఫైళ్ల క్లియరెన్స్, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, ఏపీ బడ్జెట్, స్వర్ణాంధ్ర-2047పై చర్చ జరగనుంది.