AP: వైసీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కాంలో కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్టును ఆయన ఖండించారు. తిరుపతిలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకులతో పాటు IAS, IPSలనూ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భూమన అన్నారు.