AP: సీఎం చంద్రబాబు మంచితనం వైసీపీ అధినేత జగన్‌ను కాపాడుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తిరుపతిలో కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని పాల్గొని మాట్లాడారు. ‘జగన్ మాట తీరు ఇంకా మారలేదు. చంద్రబాబు మంచితనం జగన్‌ను కాపాడుతోంది. రాబోయే రోజుల్లో జగన్‌కు ఆ 11 సీట్లు కూడా రావు.’ అని పెమ్మసాని అన్నారు.