AP: వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగించే వారికి వైసీపీ నేతలు అండగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుపరిపాలన జరగకుండా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి అకృత్యాలను కూడా చూపిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పోకడలు మంచిది కాదని హితవు పలికారు.