ఏపీ సీఎం చంద్రబాబు రేపు అనంతపురంలో పర్యటించనున్నారు. బొమ్మనహల్లోని నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1.25 నుంచి 1.55 వరకు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం పంపిణీ చేస్తారు. అనంతరం అదే గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకుని గంట పాటు స్థానిక ప్రజలతో సమావేశమై అర్జీలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరుతారు.