AP: బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్కూల్‌ను పరిశీలిస్తూ ఇండోర్ స్టేడియంలో తాడు లాగే గేమ్ ఆడారు. సీఎం చంద్రబాబు వైపు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఇతర అధికారులు, మంత్రి నారా లోకేశ్ వైపు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, అధికారులు పోటీ పడ్డారు. చివరకు మంత్రి లోకేశ్‌పై సీఎం చంద్రబాబు జట్టు విజయం సాధించింది.