అయోధ్యలోని రామాలయ దర్శనం, హారతి వేళలను శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సవరించింది. భక్తులు భారీగా తరలివస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం, భక్తులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆలయాన్ని సందర్శించవచ్చు.