AP: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదనకు పార్టీ పొలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. మూడుసార్లు, ఆరేళ్లుగా పదవిలో ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. అర్హతను బట్టి ప్రమోషన్ కానీ, వేరే కమిటీల్లోకి కానీ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.