విశాఖపట్నంలోని ఐటీఐ జంక్షన్ దగ్గర ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 28 A/G బస్సుపై దుండగుడు యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా ప్రయాణికులపై యాసిడ్ పడటంతో గట్టిగా కేకలు వేశారు. వెంటనే బస్సును నిలిపి వేసిన డ్రైవర్.. ఇతర ప్రయాణికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.