AP: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సచివాలయ ఉద్యోగి రాజారావు ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. యువతిని వదిలించుకునేందుకు జనవరి 15న ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించి రాక్షసత్వం ప్రదర్శించాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదువుకునేటప్పుడు ప్రేమ పేరుతో వెంటపడేవాడని, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేసుకోమని అడిగితే మొహం చాటేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.