మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మంగళగిరి రూరల్ పీఎస్‌లో కిరణ్‌కు ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించిన అనంతరం బందోబస్తు మధ్య అతడిని పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ క్రమంలో మంగళగిరి కోర్టు చేబ్రోలు కిరణ్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.