కాకరకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాకరకాయను తినడం వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములు నాశనమవుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాకరకాయ జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు దరిచేరవు. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.