బరువు తగ్గాలనుకునేవారికి ఎర్ర బచ్చలి కూర ఉత్తమమైన ఎన్నిక. దీనిలో అధికంగా ఉండే పోషకాలు మంచి రుచిని అందించడమే కాకుండా మంచి ఫిట్నెస్ కు ఉపయుక్తంగా ఉంటుంది. ఎరుపు బచ్చలి కూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకుంటే కడుపునిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల జంక్ ఫుడ్ లాంటి ఇతర ఆహారాల జోలికిపోరు. బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరి. దీనిని తింటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.