సబ్జా గింజలతో చర్మ సమస్యలను దూరం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉన్నవారు క్రమం తప్పకుండా సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ డి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.