శ్రీశైలం ఆలయం వద్ద చిరుత కలకలం

59చూసినవారు
శ్రీశైలం ఆలయం వద్ద చిరుత కలకలం
నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. శనివారం ఉపాలయం వద్ద చిరుత రాకను గమనించిన సెక్యురిటీ గార్డులు కేకలు వేయడంతో అక్కడి నుంచి చిరుత సమీప అటవిప్రాంతంలోకి పారిపోయింది. ఇటీవల కాలంలో చిరుత ఆరుసార్లు ఆలయ సమీపంలోకి రావడం పట్ల భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. పాతాళగంగా పాత మెట్ల మార్గంలో చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు, భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని దేవాలయ అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్