AP: బాలలే మన ప్రపంచం, వారి చదువే మనకు గీటురాయి, ఉపాధ్యాయులే మన దిక్సూచి అని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులు, టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. 'విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్, తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. సమస్యలు పరిష్కరించాం. సంస్కరణలు ఆరంభించాం' అని పేర్కొన్నారు.