AP: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు.. సిటీలో ఒక్క పిల్లవాడు కూడా చదువుకు దూరంగా ఉండకూడదని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలోనే యాచకుల పిల్లలను గుర్తించి, వారికి చదువు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నెల్లూరులో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యాచకులుగా ఉన్న చిన్నారులను గుర్తించి, చదువు ప్రాధాన్యతను వివరించి, వారు చదువుకునేలా దారి చూపాలని సూచించారు.