ఆరో తరం వైర్‌లెస్ సమాచార సాంకేతికత 6జీలో చైనాకు చెందిన చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సంస్థ అంతరిక్షం నుంచి భూమిపైకి లేజర్ ట్రాన్స్‌మిషన్‌తో సెకనుకు 100 గిగాబిట్ల (జీబీపీఎస్) డాటాను పంపించగలిగినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. చాంగ్ గువాంగ్ అనేది వాణిజ్య ఉపగ్రహ సంస్థ.