చంద్రగిరి: పాకాలలో 13 కేజీల గంజాయి స్వాధీనం

52చూసినవారు
చంద్రగిరి: పాకాలలో 13 కేజీల గంజాయి స్వాధీనం
పాకాల రైల్వే స్టేషన్ లో 13కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకాలలో సోమవారం సీఐ సుదర్శన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరుకు చెందిన విష్ణు మోహన్ రెడ్డి, తమిళనాడుకు చెందిన పాండియన్లు ఇద్దరు కలిసి విజయవాడ నుంచి మదురైకి గంజాయి తరలిస్తున్నారని వచ్చిన సమాచారంతో అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్