చంద్రగిరి హైవేలో శుక్రవారం డాబా వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న బైకు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్, లారీతో సహా పరారయ్యాడు. హైవే వెంట ఉన్న డాబాలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వాహనాలు రాత్రి, పగలు తేడా లేకుండా రోడ్డు పక్కనే పార్క్ చేయడంతో, అవి సరిగ్గా కనిపించక ప్రమాదాలకు దారితీస్తున్నాయి.