చిత్తూరు – నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించడానికి చంద్రగిరి నుంచి గాజులమండ్యం వరకు ప్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని పలువురు సర్పంచ్ లు ఎమ్మెల్యే పులివర్తి నానికి వినతి పత్రం అందించారు. శుక్రవారం జరిగిన తిరుపతి రూరల్ మండల సర్వసభ్య సమావేశంలో ఆ మేరకు వినతి పత్రం అందించారు. రూరల్ మండలం పరిధిలోని సర్పంచ్ లు తీర్మానాలు చేసిన తీర్మాన ప్రతులను ఎమ్మెల్యే నానికి అందించారు.