పాకాల మండలంలోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి అన్నారు. శనివారం పాకాల మండలంలోని కావలివారిపల్లి, కే. వడ్డేపల్లి, అచ్చమ్మ అగ్రహారం గ్రామ పంచాయతీలలోని మహిళలతో సుధా రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు డ్వాక్రా రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.