ఓ రైతు పాము కాటుకు గురైన ఘటన గురువారం చంద్రగిరి మండలం ఆముదాల కోన గ్రామంలో చోటుచేసుకుంది. రైతు నాగరాజు (49)పొలం పనులు చేస్తుండగా పాము కాటేసింది. దీంతో స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లామని, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రుయా ఆసుపత్రికి తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం నాగరాజు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.