అన్నదమ్ముల మధ్య ఆర్థిక వ్యవహారంలో తలదూర్చిన వ్యక్తిని అన్నదమ్ములే హత్య చేసిన ఘటన చంద్రగిరిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. పి. కొత్తకోటకు చెందిన అన్నదమ్ములు హరి నాయుడు, రాజేశ్ లుమధ్య కొంతకాలంగా ఆర్థిక తగాదాలు జరుగుతున్నాయి. ఈనెల 7న వారి బంధువు పాపయ్య నాయుడు మధ్యవర్తిత్వం చేశాడు. ఇది నచ్చక అతనిపై దాడి చేశారు. చికిత్స పొందుతూ పాపయ్య నాయుడు ఆదివారం మృతి చెందాడు.