చంద్రగిరి పట్టణంలోని మూలస్థాన ఎల్లమ్మను శుక్రవారం ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి సుధారెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితోపాటు ఏపీ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. లక్ష్మీనారాయణ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు.