తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో రథసప్తమి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. రథ సప్తమి రోజున ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాల్లో భక్తులకు స్వామి వారు కనువిందు చేయనుండడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగారు. భక్తుల గోవింద నామ స్మరణలు, కర్పూర హారతుల నడుమ స్వామివారి వాహన సేవలు కన్నుల పండువుగా జరిగాయి.