తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేటలో వాహనంతో సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఎస్ఆర్వో తెలిపారు. శుక్రవారం ఒక వాహనం అటువైపు రాగా ఆపినా ఆగకుండా రేణిగుంట బైపాస్ వైపు వెళ్లిపోయింది. సిబ్బంది వెంబడించడంతో ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 900కిలోల 31ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. దుంగలను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారు.