చంద్రగిరి: దారి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

74చూసినవారు
చంద్రగిరి: దారి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
చిన్నగొట్టిగల్లు పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు సరైన దారి లేక ఇబ్బంది పడుతున్నారని కూటమి నాయకులు ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి శనివారం తీసుకెళ్లారు. చిన్నగొట్టిగల్లు మసీదు వీధి నుంచి కుమ్మరపల్లికి వెళ్లే దారి మధ్యలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తిప్పిరెడ్డిగారిపల్లి, జంగావాండ్లపల్లి ప్రజలకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్