చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం శ్రవణం నక్షత్రం పురస్కరించుకొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీ భూదేవి సమేతంగా బంగారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామి వారిని సుప్రభాత సేవతో మేలు కొలుపు, ఆస్థానం పంచాంగ శ్రవణం, తోమాల,
సహస్రనామార్చన సేవలు నిర్వహించారు.