చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష్మీ భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచ్చిపై శనివారం సాయంత్రం ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి. వరలక్ష్మి, ఏఈఓ డి. ధనమంజేయ, సూపరింటెండెంట్ రాజకుమార్, ఇన్స్పెక్టర్ మునికుమార్, తదితరులు పాల్గొన్నారు.