చంద్రగిరి: సప్త వాహనల్లో సిరులతల్లి అభయం
By P. Parasuram 78చూసినవారుతిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారు చంద్రప్రభ, గజ వాహనంపై దర్శనమిచ్చారు.