ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువుపేటకి చెందిన పెనుగొండ లోకేశ్ (23) బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు రాయలచెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రామచంద్రాపురం ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.