చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రగిరి పట్టణంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి చంద్రగిరిలో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రారంభ దశలో ఉన్న నూతన ఎంపీడీవో కార్యాలయం, గోవిందధామం, జరగాల్సిన తహసీల్దార్ కార్యాలయ పనులను సమీక్షించారు.