ఘనంగా ప్రారంభమైన ఎన్ ఆర్ కమ్మపల్లి మహా భారత వార్షికోత్సవాలు

85చూసినవారు
ఘనంగా ప్రారంభమైన ఎన్ ఆర్ కమ్మపల్లి మహా భారత వార్షికోత్సవాలు
రామచంద్రాపురం మండలంలోని ఎన్. ఆర్ కమ్మపల్లి 58వ మహాభారత వార్షికోత్సవాలు గురువారం ద్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది మహాభారత ఉత్సవాలను స్థానికులు ఆనవాయితీగా నిర్వహించుకుంటారు. పగటి పూట హరికథ కళాక్షేపాలు, రాత్రిపూట వేషధారణతో కూడిన నాటకాలను 15రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త నడవలూరు రమేష్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్