చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని రేషన్ షాప్ డీలర్లతో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను రేషన్ డీలర్లు మళ్లీ పునరావృతం చేయకూడదని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం సహించబోమని, కొంతమంది డీలర్లు తమ విధుల్లో అలసత్వం చూపుతున్నారని అన్నారు.