తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో మూడు రోడ్ల కూడలిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడలి ఉందని తెలియక వేగంగా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. తిరుచానూరు పంచాయతీ అధికారులు, పోలీసులు దీనిపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని పలువురు స్థానిక ప్రజలు కోరుతున్నారు.