చిత్తూరు జిల్లా బందపల్లి గ్రామంలో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థుల ఆధ్వర్యంలో "కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్" పై గ్రామ ప్రజలకు శనివారం అవగాహన కల్పించారని ప్రిన్సిపాల్ నవీన్ కిలారి, హెచ్వోడి నిరుపమ్మ, గైడ్ దిలీపా లక్ష్మీలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్నెట్ వినియోగం పై అవగాహన కల్పించారన్నారు. ఆహార అలవాట్లు సమతులితాహార ప్రాముఖ్యతను పిక్టోరియల్ రూపంలో తెలియజేశారన్నారు.