సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విజయవాడలోని 16 వ వార్డు కృష్ణలంక, పరిసర వరద ప్రభావిత ప్రాంతాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గురువారం ఉదయం పర్యటించారు. బాధితుల సమస్యలు తెలుసుకుంటూ వారికి అవసరమైన నిత్యావసరాలను అందజేసారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించారు.