ఏర్పేడు మండలంలోని వికృతమాల గ్రామంలో మంగళవారం రథసప్తమి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీసంతాన సంపద వెంకటేశ్వర స్వామిని సూర్యప్రభ వాహనంపై ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగించారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ గోవింద నామస్మరణలు చేశారు. ముందుగా ఆలయంలోని మూల విరాట్ కు తోమాల సేవ మరియు అష్టపాద పద్మారాధన సేవ నిర్వహించారు. భక్తుల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.