చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయం నందు శుక్రవారం పబ్లిక్ హెల్త్ వర్కర్లు, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్లు మరియు ఇతర సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ చెకప్ మెడికల్ క్యాంపు మరియు అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది అని సూచించారు.