కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ సోమవారం తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ తర్వాత కూడా జిల్లాలో మొబైల్ పికెట్లు, మొబైల్ పార్టీలను, నైట్ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. గొడవలు చేసేవారిని, రౌడీషీటర్లను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు బైండోవర్ చేశామన్నారు.