కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గం నుండి 158 మంది తమ సమస్యలను ఆర్జీల రూపంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను 15 రోజులలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడా పీడీ వికాస్ మర్మత్, అధికారులు పాల్గొన్నారు.