కుప్పం ఎంపీడివో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.