పిఈఎస్ లో ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు

66చూసినవారు
పిఈఎస్ లో ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు
కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాలలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణ్య మాట్లాడుతూ. ఆగష్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. వైద్య విద్యార్థులచే గ్రామాలలో తల్లిపాలు పట్టించడం వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహనా కార్యక్రమాలు చేపడతామని డాక్టర్ సుబ్రమణ్య స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్